హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: ఆశీల్‌మెట్ట సెక్షన్ పరిధిలోని ఆర్కే నగర్ 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు జోన్-1 డీఈఈ పోలాకి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆర్కే నగర్, బీఎస్ లేఅవుట్, బాలికల పాపాహోం ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.