కృష్ణా: ఘంటసాల మండలం లంకపల్లిలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మొహమ్మద్ రజాక్, షేక్ ఖాజావలికి చెందిన పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లంకపల్లిలో రెండు పూరిళ్లు దగ్ధం


