హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌ కెప్టెన్‌ సనాకు జరిమానా

భారత్‌తో మహిళల ఆసియా కప్‌ మ్యాచులో అనుచితంగా ప్రవర్తించిన పాక్ జట్టు కెప్టెన్‌ ఫాతిమా సనాకు జరిమానా పడింది. శనివారం టీమిండియాతో జరిగిన మ్యాచులో షఫాలీ వర్మను సనా ఔట్‌ చేసి పెవిలియన్‌కు వెళ్లిపోవాలంటూ సైగ చేసింది. ఇది ICC నిబంధనకు వ్యతిరేకం. దీంతో సనాకు మ్యాచు రుసుములో 10 శాతం కోత విధించారు. అలాగే ఆమె ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ జమచేశారు.