హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌కు భారత క్రీడాకారులు వెళ్లనున్నారా..?

పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (SAF) గేమ్స్‌కు భారత బృందం వెళ్లేందుకు సమ్మతించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని, క్రీడాకారుల వివరాలు జనవరిలో వెల్లడవుతాయని పాక్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది.