హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 11లోగా ధరఖాస్తు చేసుకోవాలి

ASR: ఆరు నెలల ఉచిత రెసిడెన్సియల్ ఏఐ శిక్షణ కోసం ఆసక్తిగల గిరిజన యువత దరఖాస్తు చేసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సోమవారం సూచించారు. పెదబయలు వైటీసీలో 50మందికి, కొత్తవలస హెచ్ఎన్ టీసీలో 50మందికి శిక్షణ ఇస్తామన్నారు. 18నుంచి 30ఏళ్ల లోపు వయసు కలిగిన డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా కలిగిన యువత ఈనెల 11లోగా కార్యాలయంలో ధరఖాస్తులు అందించాలన్నారు.