హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీనియర్ జర్నలిస్టులకు వాసవి క్లబ్ సన్మానం

BPT: చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో వాసవి ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ రిపోర్టర్ ఆరాధ్యాల రామకృష్ణ, రిపోర్టర్ రామకృష్ణలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సమస్యలను వెలుగులోకి తెస్తూ.. అభివృద్ధికి జర్నలిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రతినిధులు కొనియాడారు.