హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల PGRSలో 110 ఫిర్యాదులు

నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ సునీల్ స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వారు జిల్లా ఎస్పీ సునీల్‌కు వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి 110 ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.