PDPL: జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. హోటల్ యజమానిపై దాడి చేసి, హోటల్ అద్దాలను ధ్వంసం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్‌లో హోటల్‌లోకి వెళ్లి హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో యజమాని తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మద్యం మత్తులో హోటల్ యజమానిపై దాడి


