BHPL: గోరికొత్తపల్లి మండలం రాజక్కపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో పేకాట ఆడుతున్న స్థావరంపై సోమవారం సాయంత్రం ఎస్సై త్రిలోక్‌నాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,500 నగదు, పేకముక్కలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


