హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి కృషి

ASR: కొయ్యూరు మండలం ఆడాకులలో సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రహదారి, తాగునీటి సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.