హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరుగుదొడ్లు ఉచితమంటూ అక్రమ వసూళ్లు

KRNL: శ్రావణమాసం సందర్భంగా ఉరుకుందలో భక్తుల రద్దీ పెరగడంతో, ఉచితంగా ఉపయోగించాల్సిన మరుగుదొడ్ల వద్ద కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉచిత సేవలను అందించాల్సిన చోట భక్తుల నుంచి నగదు గుంజుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఈ వసూళ్లపై విచారణ జరపాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.