హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

KMM: పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో వైరా మున్సిపాలిటీకి చెందిన రాకేష్ అనే యువకుడు తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.