హైదరాబాద్: 28°C
క్రీడలు

అభిషేక్ శర్మ టెస్ట్ క్రికెట్ ఆడాలి: రైనా

అభిషేక్ శర్మ టెస్ట్ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ సురేష్ రైనా సూచించాడు. IPL మేనేజ్మెంట్లు, కోచ్‌లు యువ ఆటగాళ్లలో టెస్ట్ ఫార్మాట్‌పై ఆసక్తి పెంచాలని కోరాడు. విదేశీ పర్యటనల్లో అభిషేక్ ఇబ్బంది పడ్డాడని, టెస్ట్ ఆడితే క్రీజులో ఎక్కువ సమయం గడిపే ఓర్పు పెరుగుతుందని తెలిపాడు. ఇది అతని షాట్ సెలెక్షన్‌తో పాటు టీ20 ఆటను కూడా మరింత మెరుగుపరుస్తుందని రైనా పేర్కొన్నాడు.