హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బులు ఇవ్వలేదని వ్యక్తిపై దాడి.. ట్రాన్స్‌జెండర్ అరెస్ట్

ADB: పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌక్ వద్ద డబ్బులు ఇవ్వలేదని తునికి సంతోష్ అనే వ్యక్తిపై ట్రాన్స్‌జెండర్ సిమ్రాన్ ఖాన్ సహా మరో ఇద్దరు దాడి చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. నిందితులు బాధితుడు నుంచి రూ.1 లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని అపహరించారని వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.