హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన సమూహాల నిర్వహణపై శిక్షణ

WGL: పండగలు, జాతరలు, ఊరేగింపుల సమయంలో భారీగా తరలివచ్చే జన సమూహాలతో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై పోలీస్‌ శిక్షకులకు నాలుగు రోజుల శిక్షణ సోమవారం మడికొండ పోలీస్‌ శిక్షణ కేంద్రంలో సీపీ శ్వేత ప్రారంభించారు. ప్రజలతో సమన్వయంగా వ్యవహరించడం, శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించడంపై వారికి ప్రాక్టికల్‌, తరగతి గది శిక్షణ అందిస్తున్నారు.