హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న రకాల వరి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ స్వీకరణ

KNR: గంగాధర మండలం కురిక్యాల రైతు వేదికలో ఏఈఓ వెంకట్ సన్న రకాల వరి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు సోమవారం సేకరించారు. గత ఏడాది నిల్వ విత్తనాలు లేదా రీసెర్చ్ స్టేషన్ విత్తనాలతో సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. సెప్టెంబర్ 10లోగా నమోదు చేసుకోకపోతే ప్రభుత్వ బోనస్ లభించదని తెలిపారు.