హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి'

అన్నమయ్య: వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో,ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్, ఎస్పీ ధీరజ్ సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరని, రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, అధిక శబ్ద కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచాకు ముందస్తు అనుమతి,మండపాల్లో అగ్నిమాపక భద్రతా చర్యలు తప్పనిసరని తెలిపారు.