హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్‌జైలర్

కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు రూ. 10,000 లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబ్‌జైలర్ నాంపల్లి దేవేందర్, బంక్ ఆపరేటర్ హరీష్ ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ డీఎస్‌పీ నేతృత్వంలోని ఏసీబీ బృందం దాడి చేసి వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పీఆర్‌ఓ తెలిపారు.