W.G: చించినాడ బ్రిడ్జిపై ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ మొగల్తూరు మండలం ముత్యాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగిడి రాంబాబు పీజీఆర్ఎస్లో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల బ్రిడ్జిపై నుంచి పలువురు గోదావరిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఘటనల నివారణకు సీసీ కెమెరాలు, రక్షణ వలయం ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'చించినాడ బ్రిడ్జిపై భద్రతా చర్యలు చేపట్టాలి'


