SDPT: చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 6 మంది విద్యార్థులు ఈ నెల 11న జరగనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పి. నరసింహాచారి తెలిపారు. కోటిలింగాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో వర్షిత్, హర్షవర్ధన్, జస్వంత్, వైష్ణో ఆర్యన్, మనోజ్, అభి ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించినట్లు వెల్లడించారు. విద్యార్థులను పీడీ సురేష్, పీఈటీ రేణుక అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


