హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు: కలెక్టర్

HYD: గణేశ్ ఉత్సవాల్లో పర్యావరణహిత మట్టి విగ్రహాలనే వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలా ప్రజలకు సూచించారు. పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. సోమవారం తన ఛాంబర్‌లో మట్టి విగ్రహాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మట్టి విగ్రహాలతో కాలుష్యం తగ్గి జలవనరులు పరిరక్షించవచ్చన్నారు.