హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన పింఛన్ల ప్రక్రియ గడువులో పూర్తి చేయాలి: కలెక్టర్

కృష్ణా: నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించి, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.