హైదరాబాద్: 28°C
క్రీడలు

US ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నసబలెంకా

యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ అర్యానా సబలెంకా జోరు కొనసాగిస్తోంది. ప్రిక్వార్టర్స్‌‌లో అమెరికా ప్లేయర్ టౌన్‌సెండ్‌పై 6-4, 6-3తో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలి సెట్‌లో గట్టి పోటీ ఎదురైనా సబలెంకా 6-4తో సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో ఒక దశలో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.