VKB: పెద్దేముల్‌లో వ్యవసాయ అధికారులు పత్తి, కంది పంటలను పరిశీలించారు. రసం పీల్చే పురుగుల నియంత్రణపై రైతులకు పలు సూచనలు చేశారు. అవసరమైన సమయంలో సిఫారసు చేసిన మోతాదులోనే పురుగుమందులు వినియోగించాలని, మందులను కలిపి పిచికారీ చేయవద్దని తెలిపారు. పురుగుల ఉధృతి పెరిగితే వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి. పావన్ ప్రీతమ్ సూచించారు.
తెలంగాణ
పురుగుల నియంత్రణపై రైతులకు అవగాహన


