హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న రకం వరికి బోనస్ అవకాశం

VKB: పెద్దేముల్‌లో సన్న రకం వరి సాగు చేసిన రైతులు రూ.500 బోనస్ పొందేందుకు సెప్టెంబర్ 10లోగా పంట వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం సూచించారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ వర్తిస్తుందని తెలిపారు. రైతులు ఏఈఓలను సంప్రదించి నమోదు పూర్తి చేసుకోవాలని కోరారు.