హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిడ్నీ బాధితుడికి ఆర్థిక సాయం

SKLM: కవిటి మండలంలోని పెద్ద కపాసుకుద్ధి గ్రామానికి చెందిన రాయితి ముకుందరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. మార్పిడికి అయ్యే భారీ ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న కుటుంబానికి కపాసుకుద్ధి గల్ఫ్ మహాసేవ సంస్థ (కేజీఎంఎస్) అండగా నిలిచింది. సోమవారం బాధిత కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సాయం అందజేశారు. దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని సభ్యుడు గురుమూర్తి కోరారు.