హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్‌తో సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న తెంబా బవుమా కెప్టెన్‌గా తిరిగిరాగా, తొడకండరాల గాయంతో పేసర్ కగిసో రబడ జట్టుకు దూరమయ్యాడు. రబడ కోలుకోవడానికి 9-10 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. మరోవైపు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు.