హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: నకరికల్లు పరిధిలో RDSS పనుల దృష్ట్యా నేడు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాంక్ బజార్, సినిమా హాల్ బజార్, కోళ్లఫారం బజార్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AEE G. సుచరిత తెలిపారు. అలాగే రైతుల సౌకర్యార్థం శివాపురం తండా ఫీడర్ పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.