హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై మొరం పోయించిన సర్పంచ్

WGL: పర్వతగిరి మండలం మాల్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్పంచ్ భూక్య మంజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రోడ్డుపై మొరం పోయించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానోత్ నర్సింహ, వార్డు సభ్యురాలు బానోత్ సునీత వెంకన్న తదితరులు పాల్గొన్నారు.