RR: సరూర్‌నగర్‌లో 4,356 చదరపు గజాల భూమిని సోమవారం HMDA అధికారులు ఈ-వేలం వేశారు. చదరపు గజానికి రూ.1.50 లక్షల కనీస ధరగా నిర్ణయించగా.. పోటాపోటీ బిడ్డింగ్‌లో గరిష్ఠంగా రూ.1.64 లక్షలు పలికింది. దీంతో ప్రభుత్వానికి రూ.71.44 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రాంతం అభివృద్ధి చెంది ఉండటం, ప్రధాన రహదారులకు సమీపంలో ఉండటంతో వేలానికి మంచి స్పందన వచ్చింది.
తెలంగాణ
సరూర్‌నగర్ భూమికి భారీ ధర


