హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి నివారణకు చర్యలు'

అన్నమయ్య: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నిశాంత్‌ అధికారులను ఆదేశించారు. హంద్రీ–నీవా నీటిని చెరువులకు మళ్లించి నిల్వ చేయాలని, ప్రతి చుక్క నీటిని సంరక్షించాలని సూచించారు. జిల్లాలోని తాగునీటి పథకాలను పర్యవేక్షించి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేయాలని ఆదేశించారు.