హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి'

PLD: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించాలని ఐద్వా పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రేషన్‌ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు కందిపప్పు, 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని, మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.