హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్

RR: నందిగామ మండలం చేగూర్ గ్రామం 4వ వార్డులో రూ.1.50 లక్షల గ్రామపంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ మంకాల శ్రీశైలం పనులకు శ్రీకారం చుట్టారు. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.