హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో కదం తొక్కిన ఆక్వా రైతులు

కోనసీమ: అమలాపురంలో ఆక్వా రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు ‘చలో అమలాపురం’ మహాసభకు తరలివచ్చారు. పేరూరు వై జంక్షన్‌ నుంచి క్షత్రియ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించి, పెంచిన సీడ్, ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ‘ఆక్వా రైతు బతుకు పోరాటం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు.