హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీ అఖిల్ మహాజన్‌కు చిట్యాల బోరి గ్రామస్తుల కృతజ్ఞతలు

ADB: రూరల్ మండలంలోని చిట్యాల బోరి గ్రామంలో కల్తీకల్లు, గుడుంబాను పూర్తిగా అరికట్టి ప్రశాంత వాతావరణం కల్పించినందుకు గ్రామస్తులు సోమవారం SP అఖిల్ మహాజన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మాదకద్రవ్యాల నివారణకు పోలీసులు చేపట్టిన అవగాహన చర్యలతో మంచి మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమార్ లక్ష్మి, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.