హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

MDK: రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేశారనే మనస్తాపంతో దుర్గా ప్రసాద్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటలతో నేరుగా స్టేషన్‌లోకి చొరబడిన అతడిని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.