హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట ఆర్టీసీ డిపో తనిఖీ

PLD: నెల్లూరు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. జగదీష్ నరసరావుపేట ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. సీట్లు, ఫ్యాన్లు, టాయిలెట్లను తనిఖీ చేసి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం బస్టాండ్ గ్యారేజ్‌లోని కార్యాలయాలు, అన్ని సెక్షన్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై పలు సూచనలు చేశారు.