హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ క్రీడల్లో చిత్తూరు సత్తా

CTR: ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2026లో చిత్తూరు జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. వివిధ క్రీడల్లో 11 స్వర్ణ, 6 రజత, 13 కాంస్య పతకాలు సాధించారు. విజేతలను జిల్లా ఎస్పీ తుషార్ సోమవారం అభినందించారు. క్రీడల్లో ప్రతిభ చూపే పోలీసులను మరింత ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.