హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం'

MHBD: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. తొర్రూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో సాధించింది శూన్యమని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం ఖాయమన్నారు.