హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు ప్రజావాణికి 37 ఫిర్యాదులు

NZB: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య 37 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విని, చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత ఎస్‌ఐలు, సీఐలకు సూచించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ తెలిపారు.