MNCL: బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ లోని మైసమ్మ గుడిలో దొంగతనానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సీఐ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు గుడి తాళాలను పగలగొట్టి హుండీ దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు చిరంజీవి, భీమయ్యలపై కేసు నమోదు చేశామన్నారు.
తెలంగాణ
గుడిలో దొంగతనానికి యత్నించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్


