KKD: స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఇండియా ఏఐ డేటా, ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు మురళీధర్ తెలిపారు. కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ల్యాబ్‌ల నిర్వహణ కోసం 20 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'20 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం'


