W.G: జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రహదారుల పక్కన చెత్త కుప్పలు కనిపిస్తే సహించేది లేదని భీమవరం కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. డంపింగ్ యార్డుల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను తక్షణమే గుర్తించాలని డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. ఇంటింటి నుంచి క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారుల పక్కన చెత్త కుప్పలు సహించం: కలెక్టర్


