KRNL: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ.. ఎమ్మిగనూరులో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ వరుణయాగం నిర్వహించారు. తుంగభద్ర నది నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చి పలు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద యాగం నిర్వహించి వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాల కోసం ఎమ్మిగనూరులో వరుణయాగం


