హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎం విశ్వకర్మ రుణాలకు శిబిరాలు: ఎల్డీఎం

సత్యసాయి: పీఎం విశ్వకర్మ పథకం పెండింగ్ దరఖాస్తులకు రుణాల మంజూరు కోసం ప్రత్యేక బ్యాంకింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎల్డీఎం సి.వి.ఫణీంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ధర్మవరం, పెనుగొండ, మడకశిర, హిందూపురం, కదిరి, పుట్టపర్తిలో శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.