హైదరాబాద్: 28°C
తెలంగాణ

దండేపల్లి మండల వ్యవసాయ అధికారి బదిలీ

MNCL: దండేపల్లి మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల వ్యవసాయ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంజిత్ కుమార్ 8 సంవత్సరాలుగా దండేపల్లి మండల వ్యవసాయ అధికారిగా అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించారు. దండేపల్లి ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారిగా లక్షెట్టిపేట ఏవో శ్రీకాంత్ నియమితులయ్యారు.