హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉత్తమ ఉపాధ్యాయుడికి సత్కారం

AKP: మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం ఎంపీపీ పాఠశాల ఏకైక ఉపాధ్యాయుడు లవుడు శ్రీనివాస్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా అధికారుల నుంచి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస్ దంపతులను గ్రామస్తులు సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రసాద్ పాల్గొన్నారు.