BDK: అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్‌వైజర్, సర్పంచ్ పాల్గొని గర్భిణీలకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు అందించి ఆశీర్వదించారు. పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలు, అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పోషకాహార సేవలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
అంగన్వాడి సెంటర్‌లో గర్భిణీలకు శ్రీమంతాలు


