హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మండపాలకు అనుమతి తప్పనిసరి'

ASR: వినాయక చవితి మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందాలని అనంతగిరి ఎస్సై కే. శంకర్‌రావు సూచించారు. మండపం ప్రదేశం, విగ్రహం ఎత్తు, పూజల రోజులు, నిమజ్జనం తేదీతో పాటు ఐదుగురు కమిటీ సభ్యుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. డీజేలు, నృత్యాలకు అనుమతి లేదని, ఊరేగింపును సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల్లోపు పూర్తి చేయాలని తెలిపారు.