హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

ప్రకాశం: గణేష్ ఉత్సవాల అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా పొందాలని మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో విద్యుత్, అగ్నిమాపక పరిష్కారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు.